ధ్వని న్యూస్
తెలుగు వారి కోసం

రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి
రోడ్డు ప్రమాదంలో కారు లారీ ఢీకొని షాబాద్ మండలానికి చెందిన సీనియర్ టీఆర్ఎస్ నాయకులు కాల్వ మాధవరెడ్డి (56)మలిపెద్ది పూర్ణచందర్ మృతి చెందారు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం మధ్యాహ్నం షాద్నగర్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న కారు బాలానగర్ మండలం పెద్దయిపల్లి స్టేజ్ వద్ద జాతీయ రహదారి పై లారీ ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు .వారు మృతి చెందడంతో సంకేపల్లి గూడాలో సర్దార్ నగర్ గ్రామాలలో విషాదం నెలకొంది

ఘనంగా అయ్యప్పస్వామి పూజ
స్వామి శరణమయ్యప్ప శరణు శరణు అయ్యప్ప అంటూ షాబాద్ మండలంలోని కుమ్మరి గూడా గ్రామంలో గురువారం అయ్యప్ప స్వామి పూజ నిర్వహించి అనంతరం ఇరుముళ్లు కట్టుకున్నారు అయ్యప్ప స్వాములు ఆటపాటలతో గ్రామం నలుమూలలా మారుమ్రోగింది అయ్యప్పస్వామి ఇలా ఆట పాటలతో గ్రామస్తులు మంత్రముగ్దులయ్యారు సాయంత్రం ఇరుముళ్లు కట్టుకొని శబరిమలకు పయనించారు ఈ కార్యక్రమాన్ని చూడడానికి గ్రామస్తులు స్వాములు పెద్ద ఎత్తున తరలివచ్చారు

స్వచ్ఛ భారత్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి
గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కుమ్మరి గూడా గ్రామ సర్పంచ్ నందిగామ రాములు గౌడ్ పేర్కొన్నారు .గురువారం షాబాద్ మండల పరిధిలోని కుమ్మరిగుడా లో గ్రామ సభ నిర్వహించి అనంతరం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేస్తుందన్నారు గ్రామంలోని ప్రజలకు తన వంతు మౌలిక సదుపాయాలను కల్పించడంలో తనవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు గ్రామంలో ఇప్పటివరకు సీసీ రోడ్లు నీటి సరఫరా విద్యుత్ దీపాలు మురుగు కాల్వల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు మిగిలిన పనులను దశలవారీగాఅభివృద్ధి చేస్తామన్నారు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని సూచించారు ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ సత్తయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
సోర్స్
షాబాద్ చేవెళ్ళ
మీరు పంపిన విషయాలను కూడా ప్రచురిస్తాం
మా వాట్సప్ నెంబర్ 9550547298
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి