సునీల్ కి మన మిత్రుడు నరేష్ ఆర్థిక చేయూత.
ప్రపంచంలో నాలుగవ అతి ఎత్తైన పర్వతమైన మరియు ఆఫ్రికా ఖండంలో అతి ఎత్తయినటువంటి కిలిమంజారో అనే పర్వతాన్ని అధిరోహించడానికి ఎంపిక అయిన షాబాద్ మండలంలోని కుర్వగూడ గ్రామానికి చెందిన దాదె సునీల్(23) అనే యువ క్రీడాకారుడికి మిత్రుడు నరేష్ గారు పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అందించి ప్రోత్సహించారు.
ఆఫ్రికా ఖండంలోనే అతి ఎత్తయినటువంటి మరియు అతి ఉష్ణ ప్రాంతమైన కిలిమంజారో అనే పర్వతాన్ని అధిరోహించడానికి అర్హతగల అతి కొద్దిమందిలో దాదె సునీల్ అనే యువకుడు ఎంపిక కావడం గర్వకారణం అని,సముద్రమట్టం నుండి దాదాపు ఆరు కిలోమీటర్ల ఎత్తులో గల పర్వతాన్ని అధిరోహించడం అంత సులువు కాదని గ్రామీణ స్థాయి నుండి ఎదిగి అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్న సునీల్ అనే క్రీడాకారుడిని ఈసందర్భంగా ఎస్సైఅభినందించారు. అయితే దీనంత టికి దాదాపు 2,60,000 రూపాయల ఖర్చు మొత్తాన్ని ఆ నిరుపేద క్రీడాకారుడే భరించుకోవలసి ఉంటుంది. గ్రామీణ స్థాయి నుండి ఎదిగి తెలంగాణ పేరు ప్రతిష్టలను ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి వెళుతున్నటువంటి ఈ నిరుపేద క్రీడాకారుడిని ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ,మిత్రుడు నరేష్ తన వంతు సహాయంగా 10000 రూపాయల నగదును అందజేయడం జరిగింది.
ఇక కూడా ఆర్థిక సహాయం అవసరం
ఈ క్రింది వీడియోలో చూడండి
పూర్తి వివరాలకు,
వీడియో చూసిన తరువాత మీకు తోచిన సహాయం చేయగలరు
సునీల్ ఫోన్ నెంబర్:-+91 80969 79891
మన వంతుగా ఒక షేర్ చేసి సునీల్ లక్ష్యని కి సహకారం అందిదం
జై భారత్ జై హింద్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి