16, అక్టోబర్ 2017, సోమవారం

తెలుగు వారి కోసం

subscribe

తెలుగు వారి కోసం





సాష్టాంగ నమస్కారము సాష్టాంగ నమస్కారం పురుషులు మాత్రమే చెయ్యాలి. స్త్రీలకు నిషిద్ధం. సాష్టాంగ ప్రణామం పురుషులు చేయవచ్చు. తమ ఎనిమిది అంగాలనూ, అంటే వక్షస్థలం, నుదురు, చేతులు, కాళ్లు, కళ్లు భూమిపై ఆన్చి నమస్కరించవచ్చు. కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చెయ్యాలనుకున్నప్పుడు ఉదరం నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. ఇలా చెయ్యటం వల్ల గర్భకోశానికి ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంది. అందుకే ఇతిహాసాల్లో, ధర్మశాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్లపై ఉండి నమస్కరించాలని చెప్పారు. సాష్టాంగ నమస్కారము అంటే ఎనిమిది అంగాలతో చేయదగిన నమస్కారము అని పేరును బట్టి స్పష్టంగా అర్థం అవుతూనే ఉన్నది. అయితే ఏమిటి ఆ ఎనిమిది అంగాలు. ఈ శ్లోకం హృదయస్థం చేస్తే ఆ అంగాలన్నీస్పష్టంగా గుర్తు ఉంటాయి.
" ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా
పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం ప్రణామో ష్టాంగ ఈరితః"

“అష్టాంగాలు” :- అంటే “ఉరసా” అంటే తొడలు, “శిరసా” అంటే తల, “దృష్ట్యా” అనగా కళ్ళు, “మనసా” అనగా హృదయం, “వచసా” అనగా నోరు, “పద్భ్యాం” అనగా పాదములు, “కరాభ్యాం” అనగా చేతులు, “కర్నాభ్యాం” అంటే చెవులు. ఇలా “8 అంగములతో నమస్కారం” చేయాలి. “మానవుడు” సహజంగా ఈ “8 అంగాలతో” తప్పులు చేస్తుంటారు. అందుకే “దేవాలయంలో” బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ “దేవునికి” నమస్కరించి “ఆయా అంగములు” నెలకు తగిలించాలి. ఇలా చేయడం వల్ల “మనం” చేసినటువంటి “పాపాలు” తొలగి “పుణ్యం” లభిస్తుంది. ముఖ్యంగా :- “దేవాలయంలో” సాష్టాంగ నమస్కారం “దేవుడికి, ధ్వజస్తంభానికి” మధ్యలో కాకుండా “ధ్వజస్తంభం” వెనుక చేయాలి. ఉరస్సుతో నమస్కారం - అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి. శిరస్సుతో నమస్కారం - అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి. దృష్టితో - అనగా నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ మూర్తికి నమస్కారం చేస్తున్నామో ఆ మూర్తిని చూడగలగాలి. మనస్సుతో నమస్కారం - అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మనసా నమ్మి చేయాలి. వచసా నమస్కారం అంటే వాక్కుతో నమస్కారం - నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్టదైవాన్ని మాటతో స్మరించాలి. అంటే - ఓం నమశ్శివాయ అనో లేక ఓం నమో నారాయణాయ అనో మాట పలుకుతూ నమస్కరించాలి. పద్భ్యాం నమస్కారం - అంటే - నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి. కరాభ్యాం నమస్కారం అంటే - నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి. జానుభ్యాం నమస్కారం అంటే - నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి..

Plz subscribe get more local updates



మీరు సహాయం చేస్తే ఎవరెస్ట్ ఎక్కుత


Facebook వీడియోస్ Download చేయండి ఇలా !


మీ వాట్సప్ "ఫాంట్"ను మార్చుకోండి.


వాట్సప్ లో ఈ చిన్న సీక్రెట్ మీకు తెలుసా?


నోటితో చెప్తే టైపింగ్ తెలుగు లో వస్తుది.


ఒక గంటలో 200 లైక్స్ మీ ఫోటో కు.


తెలుగు మెసేజ్ లను చదివి వినిపించే యాప్ మీ కోసం.


మీ ఇంట్లో మీ ఫోన్ దొరకడం లేదా? ఐతే 3 చప్పట్లు కోటండి .





మీరు చెప్పిన విషయం పై మేము వీడియో చేస్తాంమీరు చేయవలసినది
మీ ప్రశ్న ను మా కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి


SUBSCRIBE FOLLOW SHARE LIKE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Chevella Bajrang Dal || Latest video